Monday, May 31, 2010

కవి వృషభం - కామధేనువు

హరికథ పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారు ఆజానుబాహువు. సంగీత, సాహిత్యాలలో దిట్ట. ఆయన తెలుగులోనే కాదు, ఆంగ్లంలో కూడా హరికథ చెప్పి మెప్పించిన ఘనుడు. అసలు హరికథనే కాదు గిరికథ చెప్పమన్నా సిద్ధం. అటువంటి ప్రతిభాశాలితో పరాచికాలాడటమంటే సామాన్యమైన విషయం కాదు. ఆది సామాన్యమైన వ్యక్తి అయినా, మహారాజైనా ఒకటే !

నారాయణదాసుగారు ఒకరోజు తన శిష్యబృందంతో విజయనగరం పుర వీదులగుండా నడిచి వెడుతున్నారు. అదే సమయంలో విజయనగర ప్రభువు ఆనంద గజపతి మహారాజు గారు వ్యాహ్యాళికి బయిలుదేరారు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. మహారాజు కూడా సాహిత్య పిపాసి, సరసుడు.

దాసుగార్ని చూసి ఊరికే వెళ్లిపోలేక ఓ చమత్కార బాణం విసరాలనిపించి " ఎక్కడికి కవి వృషభం ఇలా బయిలుదేరింది ? " అన్నారు రాజావారు.

ఆదిభట్ల వారేమైనా తక్కువ తిన్నారా ? ఆయనతోనా పరాచికాలు ! అందుకే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే అందుకుని " ఇంకెక్కడికి - తమవంటి కామధేనువు వద్దకే.... " అని ప్రతి చమత్కారం విసిరారు.

ఆదిభట్లవారి సమయస్పూర్తికి ఆనందగజపతి హృదయం ఆనందమయమైపోయింది. 

Vol. No. 01 Pub. No. 305

4 comments:

అశోక్ పాపాయి said...

chakkani taapa raasinadduku maaku kooda anaddam iyindi .....nice writing

SRRao said...

అశోక్ పాపాయి గారూ !
ధన్యవాదాలు

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

హ హ హ! ఆఫీసులో గట్టిగా నవ్వేసాను.
:-)

SRRao said...

* లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారూ !

సంతోషం, ఆదిభట్లవారు మిమ్మల్నింత నవ్వించినందుకు.....

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం