Tuesday, May 11, 2010

జీవితచక్రం

నాడు దర్జాగా తిరిగిన దర్జీ చక్రం
నేడు రోడ్ల పాలైన పరిణామ క్రమం

ఒకప్పుడు బట్టలు టైలర్ మేడ్
మరిప్పుడు అవే రెడీమేడ్


కంపెనీల మెరుస్తున్న బట్టలు
కొట్టాయి కాలుతున్న పొట్టలు

ఒకప్పుడు మన దగ్గరకే జనం
మరిప్పుడు జనం దగ్గరకే మనం



పని దొరికితేనే కడుపులు నిండేది 
చక్రం తిరిగితేనే జీవిత చక్రం తిరిగేది

అప్పుడే మా జీవితాల్లో వెలుగులు నిండేది
లేకపోతే చీకటే మాకు మిగిలి వుండేది  







Vol. No. 01 Pub. No. 289

3 comments:

చిలమకూరు విజయమోహన్ said...

:( ప్చ్...

సంతోష్ said...

ide modatisaari choodatam....

SRRao said...

* విజయ మోహన్ గారూ !
ధన్యవాదాలు

* సంతోష్ గారూ !
నాకూ ఇదే మొదటిసారి చూడటం. మొన్న వేసవి యాత్రకు తమిళనాడు వెళ్ళినపుడు అక్కడ చూసాను. ఆంధ్రలో కూడా ఆ పరిస్థితి త్వరలోనే వస్తుందేమో !

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం