Monday, March 8, 2010

మహిళాలోకానికి శుభాభినందనలు

పుడమి తల్లి మహిళ
లెక్కలేనంత సంతానాన్ని భరిస్తోంది
ప్రకృతిమాత మహిళ
అంతులేనంత కాలుష్యాన్ని భరిస్తోంది

నవమాసాలు కడుపున భరించేది మహిళ
రెక్కలోచ్చేవరకూ మన అల్లరి భరించేది మహిళ
మనకి తొలి గురువు, మార్గదర్శి ఆ మహిళే
జీవితాంతం తోడూ నీడగా వుండి భరించేది మహిళ
కుటుంబ వ్యవహారాల నిర్వాహకురాలు కూడా ఆ మహిళే
మహిళ లేనిదే మగవాని జీవితం అసంపూర్ణం
అర్థనారీశ్వర తత్వమే దీనికి నిదర్శనం

ముఖ్యంగా మహిళా బ్లాగరు మిత్రులకు మరిన్ని శుభాకాంక్షలతో ...




గమనిక : ఈ వీడియోలో కొంతమంది మహిళా ప్రముఖుల చిత్రాలున్నాయి. వారిని కనిపెట్టి, వారే రంగంలో ప్రముఖులో వరుసక్రమంలో చెప్పగలరేమో ప్రయత్నించండి..

Vol. No. 01 Pub. No. 217

10 comments:

సుభద్ర said...

రావుగారు,
చాలా చాలా బాగు౦ది.......
ఇ౦క నాకు ఆ పోటోలు ఒపెన్ కావట౦లేదు..ఆర్డర్ చెప్పడాని టై చేయలేకపోతున్నా...

SRRao said...

సుభద్ర గారూ !
ధన్యవాదాలు. వీడియో ఫార్మేట్లో వుండడం వల్ల ఫొటోలు ఓపెన్ కావండీ ! ప్లే చేసుకుని కావల్సిన ఫొటో దగ్గర పాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ప్రారంభించండి. మీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను.

తృష్ణ said...

firstly thankyou verymuch for the wishes...మీ టపాలన్నింటిలోకీ ఇది నాకు చాలా నచ్చిందండీ..చాలా మంచి పాటను ఎంచుకున్నారు. కానీ క్విజ్ లో పేర్లన్నీ చెప్పలేకపోతున్నాను. ఝాన్సి లక్ష్మీ బాయి,మొల్ల,సీతా దేవి,మీరా బాయి,రవివర్మ పైంటింగ్స్ కాక పేరుపొందిన మన దేశపు మహిళామణుల్లో గుర్తున్న మటుకూ ఇవిగోండి.. ప్రతిభా పాటిల్, అరుంధతీ రాయ్, కిరణ్ బేడీ, ఇందిరా గాంధీ, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, శొభా నాయుడు, మదర్ తెరెసా, మదర్,కల్పనా చావ్లా, లతా మంగేష్కర్, కరణం మల్లీశ్వరి(ఈ పేరు కాకపోయినా ఒక స్పోర్త్స్ ఉమన్) , పి.టి.ఉష, సానియా మీర్జా...

కొందరు మనుషులు తెలుసు కానీ పేర్లు గుర్తు రావట్లేదండి సమయానికి.

మధురవాణి said...

చాలా బాగా చెప్పారండీ! ధన్యవాదాలు :-)

SRRao said...

తృష్ణ గారూ !
ధన్యవాదాలు. మీరు చెప్పగలిగినంతవరకూ ఒక్క శోభానాయుడు తప్ప మిగిలినవన్నీ సరిగానే చెప్పారు. మిగిలినవి ఇంకెవరైనా గుర్తుచేసుకుని చెప్పగలరేమోనని చూస్తున్నాను. సుభద్రగారు ఇప్పటికే ఆ ప్రయత్నంలో వున్నారు. అందుకని మరికొంత సమయం తీసుకుని జవాబులన్నీ వరుస క్రమంలో ఇస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త.

SRRao said...

మధురవాణి గారూ !
కృతజ్ఞతలు. మీరు కూడా ఫోటోలలోని ప్రముఖుల్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదూ ?

Vinay Chakravarthi.Gogineni said...

excellent song... excellent lyrics...

SRRao said...

వినయ్ చక్రవర్తి గారూ !
ధన్యవాదాలు

Vinay Chakravarthi.Gogineni said...

asalu naaku ee song gurinchi teleedu.ilantivi parichayam cheyandi....evaro vastaarani song dadaapu 50 imes vinivutaanu mee blogki vachhi.

SRRao said...

వినయ్ చక్రవర్తి గారూ !
చాలా సంతోషం. ఇలాంటి మంచి పాటలెన్నో మేము ఆస్వాదించాం! అనుభవించాం ! మాతరం గొప్పదని, ఆ పాటలే గొప్పవని, ఇప్పటి తరం తక్కువదని, ఇప్పటి పాటలు మంచివి కావని నేననుకోను. అది తరాల అంతరం. కానీ అప్పటి మంచి పాటల్ని, వాటిని అందించడంలో అప్పటి వారి కమిట్మెంట్ గురించి ఇప్పటి నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు తెలుసుకుంటే ఇంకా మంచి పాటలు ఇప్పుడూ వస్తాయి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం