Sunday, January 24, 2010

అరవై వసంతాల ' జనగణమణ '

జనగణమణ అధినాయక జయహే
భారత భాగ్య విధాతా !
............................

మన జాతీయ గీతం
విశ్వకవి రవీంద్రుని కవితాఝరి
ఆసేతు హిమాచలం పరవశించి పాడుకునే చైతన్య గీతం
యావత్తు భారత దేశం జాతీయతా భావం నింపిన గీతం


1911 డిసెంబరు 27 న కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో వినిపించిన ఈ గీతం చివరిసారి స్వరపరచడానికి, ఆంగ్ల భాషలోకి అనువాదం చెయ్యడానికి 1918-19 ల మధ్య మన ఆంధ్రప్రదేశ్ వేదిక అయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలోని థియొసాఫికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉన్న ఐరిష్ కవి, తన మిత్రుడయిన జేమ్స్ హెచ్. కజిన్స్ ఆహ్వానం మేరకు అక్కడకు వచ్చి తుది మెరుగులు దిద్దారు.




ఈ గీతం 1911 లో భారత జాతీయ కాంగ్రెస్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అయిదవ జార్జ్ చక్రవర్తిని పొగుడుతూ రాసినదని అప్పట్లోనే పత్రికల్లో దుమారం రేగింది. దానికి ఠాగూర్ జార్జ్ చక్రవర్తిని కీర్తించిన గీతం ఒక హిందీ కవి రాసిన గేయమని, జనగణమణ కాదని, పత్రికలు పొరబడ్డాయని అప్పట్లోనే వివరణ ఇచ్చారు.





జనగణమణ గీతం భారత జాతీయ గీతంగా అధికారికంగా 24 జనవరి 1950 న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ రోజు మన జాతీయ గీతం షష్టి పూర్తి జరుపుకుంటోంది. ఇంతకాలంగా మనలో జాతీయతా భావాన్ని నింపిన ఈ గీతాన్ని భావితరాలకు అందించడం అందరి కర్తవ్యం.
 


జనగణమణ  
అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభసమయంలో 
జాతీయ స్పూర్తి గల భారతీయులందరికీ శుభాకాంక్షలు 


 Vol. No. 01 Pub. No. 166

2 comments:

జయ said...

మన జాతీయగీతం మనకి గర్వ కారణం. మనమందరం ఈ విలువను గుర్తించి గౌరవించాలి. షష్టి పూర్తి చేసుకున్న ఈ గొప్ప గీతం మన జాతీయతని దేశదేశాలకు చాటుతుంది. జాతీయగీతం అంటే ఏంటి అండిగితే జవాబు చెప్పలేని స్థితి లో ఇంకా చాలా మంది పిల్లలే ఉన్నారు. వాళ్ళందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనదే. ఈ బాధ్యత తీసుకున్న మీకు నా ధన్యవాదాలు.

SRRao said...

జయ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం