Monday, November 9, 2009

పరిశుభ్రం

అదొక అయిదు నక్షత్రాల హోటల్.
మసక వెలుతురులో అంతా శుభ్రంగా ఉంది
బేరర్లు శుభ్రమైన యూనిఫాంలు వేసుకున్నారు
అక్కడ అన్నీ శుభ్రంగా ఉన్నాయి
గ్లాసులు శుభ్రంగా ఉన్నాయి
వాటిలో నీళ్లు మరీ శుభ్రంగా ఉన్నాయి
ప్లేట్లు తెల్లగా మల్లె పువ్వుల్లా మెరిసిపోతున్నాయి
అక్కడ ఒక ఈగగానీ, ఒక దోమగానీ
మచ్చుకి ఒక బొద్దింక గానీ లేవు
అన్నీ కిచెన్ లోనే ఉన్నాయిట

ఇది రావిశాస్త్రి గారు చాలా కాలం క్రితం రాసిన మినీ కథ. ' యువ ' మాస పత్రికలోనో, ' జ్యోతి ' మాస పత్రికలోనో సరిగా గుర్తులేదు ( ఆ ప్రతి నా ఖజానా లో లభ్యం కాలేదు ) ప్రచురించారు. నాకు గుర్తున్నంతవరకూ సరిగానే రాసాననుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే అవి నావే గానీ శాస్త్రిగారివి మాత్రం కాదని గమనించ ప్రార్థన. వ్యంగ్యంలోను అద్భుతమైన శైలి రావిశాస్త్రిగారిది.

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం