Sunday, November 8, 2009

నలుగురు రచయితల పాట

ఈ పాట ప్రముఖ రచయిత ఆత్రేయ దర్శకత్వం వహించిన ' వాగ్దానం ' చిత్రంలోనిది అన్న విషయం జగద్విదితం. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ పాట రాసింది ఆత్రేయ కాదనే విషయం కూడా అందరికీ తెలిసినదే ! ఈ గీత రచనలో నలుగురు రచయితల ప్రమేయం ఉంది. వారెవరో, వారి ప్రమేయమేమిటో చెప్పగలరా ?

8 comments:

జ్యోతి said...

ఈపాట రాసింది శ్రీశ్రీ. కాని ప్రారంభంలో వచ్చే శ్లోకం "శ్రీనగజాతనయం" సాధారణంగా హరికధకులు పాడేది,మధ్యలో "పెళ్లుమనె విల్లు"రాసింది కరుణశ్రీ, చివరిలో "భూతలనాధుడు రాముడు" బమ్మెరపోతన రాసింది..

కరెక్టేనా?? ఎప్పుడో పుస్తకాలలో చదివిన గుర్తు..

కోడీహళ్ళి మురళీ మోహన్ said...

ఈ హరికథ వ్రాసింది మహాకవి శ్రీశ్రీ. దీనిలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిదీ, బమ్మెర పోతన్నదీ పద్యాలను వాడుకున్నారు. శ్రీ నగజా తనయం...అనేది ఒక(?) వాగ్గేయ కారుని కృతి.

SRRao said...

జ్యోతి గారూ !
మురళీ మోహన్ గారూ !
మీ సమాధానాలు నూరుశాతం సరైనవే !
ధన్య వాదాలు.

Kandi.Shankaraiah said...

ఈ మధ్యనే ఒక బ్లాగులో ఈ పాట సాహిత్యం చూసి క్రింది వివరాలిచ్చాను. బ్లాగు పేరు గుర్తుకు రావడం లేదు.
ఈ హరికథ ప్రారంభంలో వచ్చే "శ్రీ నగజా తనయం...." అనే ప్రార్థన ఒక ప్రసిద్ధ వాగ్గేయకారుని రచన. పేరు మరచిపోయాను.
మధ్యలో వచ్చే పద్యం కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి పద్యం. అది ఇది .....
తే.గీ. ఫెల్లు మనె విల్లు, గంటలు ఘల్లు మనె, గు
భిల్లు మనె గుండె నృపులకు , ఝల్లు మనియె
జానకీ దేహ మొక నికేషంబు నందె;
నయము, జయమును, భయము, విస్మయము గదుర.
ఇక చివరగా వచ్చే పద్యం బమ్మెర పోతనది. ఆంధ్ర మహా భాగవతం నవమస్కంధంలోని "శ్రీరామ చరిత్రము" లోనిది. ఆ పద్యం ఇది .....
కం. భూతలనాథుఁడు రాముఁడు
ప్రీతుండై పెండ్లియాడె పృథుగుణమణి సం
ఘాతన్,భాగ్యోపేతన్,
సీతన్, (ముఖకాంతి విజిత సితఖద్యోతన్).
బ్రాకెట్టులో ఉన్న భాగాన్ని పాటలో పెట్టలేదు.
ఇక మిగిలిన సాహిత్యం శ్రీశ్రీది.
అన్నట్టు శ్రీశ్రీది కానిదీ, మనందరిదీ, ఎవరు రాసారో తెలియనిదీ ఒకటుంది. అది ...
"శ్రీమద్రమారమణ గోవిందో హరిః"

భావన said...

హాయ్ బలే వుందండీ పాట నా చిన్నప్పుడు తెగ వచ్చేది రేడియో లో. నాకు బలే ఇష్టం. నాకు హరికధలంటే చాలా ఇష్టం, అందరు వెక్కిరిస్తారు కాని బలే వుంటాయి హరి కధలు. చాలా బాగుంది నేనెప్పుడు చూడలేదు వినటం తప్ప. మరీ ఆయన ఎవరో కాని ఆయనను పక్కన పెట్టి నాగేశ్వర రావు బండి తోయటమె కొంచం అతిశయోక్తి కాని ;-) బాగుంది.

కొత్త పాళీ said...

భావన ,, యెప్పుడూ హరికథ చూళ్ళేదా? హయ్యో హవ్వ హవ్వ (బుగ్గల్నొక్కుకుంటూ)

SRRao said...

శంకరయ్య గారూ !
సవివరంగా తెలియజేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
భావన గారూ !
హరి కథ నిజంగా అద్భుతమైన ప్రక్రియ. టీవీ లొచ్చాక మూలన పడిపోయిన సాంప్రదాయిక కళారూఫాల్లో ఇదొకటి. సినిమా నిజానికి ఒక రకంగా మన కళారూపాల్ని పదిల పరిచిందనే చెప్పాలి. హరికథను విశ్వనాథ్ గారి ' సూత్రధారులు ' వరకూ చాలా చిత్రాల్లో కథానుసారంగా వాడుకున్నారు. ఆ విషయాలు మరోసారి. ఈ విషయంలో దూరదర్శన్ కృషి మెచ్చుకోదగ్గది. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
కొత్తపాళీ గారూ !
ఆశ్చర్య పోకండి. భావన గారే కాదు. మన సాంప్రదాయ కళల్ని ప్రత్యక్షంగా చూడని వారు చాలామందే ఉన్నారు. ఎంతవరకూ సాధ్య పడుతుందో తెకియదు గానీ మన సాంప్రదాయ కళారూపాల్ని ముందు తరాలు గుర్తు పెట్టుకునేలా చిత్రీకరించి భద్రపరచాలని నా కోరిక.

Ramalingaswamy Gumma said...

sangiita saahityaalato kalagalipina prakriya Harikatha. diinni malli brtikovaalante,pattaNa gramiiNa vaasulu diikkhsto nadumbiginchi koncham prochaahamisthe manci kadhalu ceppagala kalaakaarulunnaaru

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం