Friday, October 23, 2009

ప్రాప్తం




 అనుకున్నామని జరగవు కొన్నీ
అనుకోలేదని ఆగవు అన్నీ
ఇదొక సినిమా పాట. మనకేది ప్రాప్తమో అదే జరుగుతుంది తప్ప మనం ఊహించినవన్నీ జరుగవు. మహానటి సావిత్రి విషయం లోనూ అదే జరిగింది.
' మూగమనసులు ' తెలుగు చిత్రాలలో ఇదొక ట్రెండ్ సెట్టర్. సావిత్రి నటనా వైదుష్యానికి పరాకాష్ట. ఆ చిత్రం ఎంత విజయవంతమైందో అప్పటి తరానికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని తమిళంలో తనే స్వీయ దర్శకత్వంలో స్వయంగా నిర్మించింది సావిత్రి. అక్కినేని చేసిన గోపీ పాత్రను శివాజీ గణేశన్, జమున చేసిన గౌరి పాత్రను చంద్రకళ ధరించారు. శివాజీ అప్పటికే సూపర్ స్టార్. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ సినిమా ప్రారంభం నుంచి విడుదల అయ్యేదాకా అనేక కష్టాలను ఎదుర్కొంది సావిత్రి. మొదట్లో తెలుగు చిత్ర విజయంవల్లనైతేనేమి, శివాజీ మార్కెట్ వల్ల నైతేనేమి విడుదల హక్కులకోసం చాలామందే వచ్చారు. ' అదృష్టం అందలం ఎక్కిస్తే దురదృష్టం బురదలోకి లాగిందట ' . సరిగ్గా అదే జరిగింది సావిత్రి జీవితంలో. విజయంమీద విపరీతమైన ఆశలు పెట్టుకున్న ఆమె హక్కులెవరికీ ఇవ్వలేదు. అదే ఆమె పాలిటి దురదృష్టమైంది. ఆర్థికవత్తిడుల మధ్య ఎలాగో పూర్తిచేసింది. ఈ గోరుచుట్టుపైన మరో రోకలి పోటు శివాజీ చిత్రాలు మూడు పరాజయం పాలయ్యాయి. ఆ వరుసలో ఈ చిత్రం కూడా పరాజయం పాలయ్యింది. తెలుగులో ఆ చిత్రానికి ప్రాణంగా నిలిచిన సాహిత్యం, సంగీతం తమిళంలో బలహీనపడ్డాయి. మహానటి జీవితాన్ని అధోలోకంలోకి నెట్టిన ఆ చిత్రం పేరు " ప్రాప్తం ".

2 comments:

భాస్కర రామిరెడ్డి said...

చిత్రం పేరు యాదృచ్చికమా లేక దైవ నిర్ణయమా !

SRRao said...

భాస్కర రామి రెడ్డి గారూ !
పేరు నిర్ణయించింది సావిత్రే ! అయితే దైవ నిర్ణయం యాధృచ్చికంగా సావిత్రికి ప్రాప్తం లేకుండా చేసింది.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం