Sunday, October 11, 2009

ఆశ



ఆశ

అమ్మ చందమామని తెచ్చిస్తుందనే ఆశ
చిన్నప్పుడు బువ్వ తినిపిస్తుంది

తోటి పిల్లలతో ఆడుకోవచ్చనే ఆశ
బడికి పంపి అక్షరాలు దిద్దిస్తుంది

మంచి ఉద్యోగం వస్తుందనే ఆశ
ఉన్నత చదువులు చదివిస్తుంది

జీవితానికో తోడు కావాలనే ఆశ
పెళ్లి దాకా నడిపిస్తుంది

వంశాభివృద్ధి చెయ్యాలనే ఆశ
ముద్దులొలికే పిల్లల్ని ఇస్తుంది

వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశ
కష్టబడి సంపాదించేటట్లు చేస్తుంది

శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనే ఆశ
పిల్లలమీద ఆధారపడేటట్లు చేస్తుంది

అది నిరాశ కాకూడదనే ఆశ
మరణందాకా నడిపిస్తుంది

జీవన ప్రయాణానికి ఆశే ఇంధనం
గమ్యాన్ని చేరడానికి అదే ఆలంబన

15 comments:

బుజ్జి said...

Rao Garu really Exceleent.... superbbbb gaa vrasaru.... aasha adbutam....

SRRao said...

బుజ్జి గారూ !
విజయ మోహన్ గారూ !
కృతజ్ఞతలు

Padmarpita said...

అద్భుతమైన ఆశండి!

తృష్ణ said...

చాలా బాగుందండి.

SRRao said...

పద్మార్పిత గారూ !
తృష్ణ గారూ !
కృతజ్ఞతలు.

hasini said...

meeru vrasina aasa kavitha manasuku haddukunelaa undi...vastavaanni chaala chakkagaa raasaru.
chala chala nachindi...

Hasini said...

హాసిని గారూ !
శిరాకదంబానికి స్వాగతం. కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

Unknown said...

sare sir mee aasha kavitha bagundi
mari meeru ee kavithanu
e ashatho rasaaru cheppaledu

SRRao said...

శ్రీ జాబిలి గారూ !
శిరాకదంబానికి స్వాగతం. నా ' ఆశ ' ను మీరందరూ చదువుతారని, అందరూ తమకు తెలిసిన జీవితాన్ని మరోసారి దర్శించుకుంటారనే ఆశతో రాసాను.

Unknown said...

కవితచాలాబాగుంది
ప్రతిపదం వర్తమానానికి ప్రతీక
కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి

SRRao said...

వీరభద్ర శాస్త్రి గారూ !
శిరాకడంబానికి స్వాగతం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

Pammy said...

అమ్మ పొత్తిళ్ళలో పాల కోసం ఆశ నుంచి..
పోయేటప్పుడు బ్రతకాలనే ఆశ వరకు..
మనిషి జీవితమే ఆశ
అందుకే కదా మనిషి ఆశ జీవి అనేది
కాని ఈ ఆశల్లో కల ప్రతీ శ్వాసను
కళ్ళ ముందు నిలిపారు..
చాలా బాగుంది మీ కవితాశ ...

SRRao said...

రమేశ్ గారూ !
శిరాకదంబానికి స్వాగతం. ' ఆశ ' లోని ఆంతర్యాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

aasha aasha gane migili potundi
aasha marokaripina aadhara padela chestundi
aasha vastavaniki dooranga untundi
kaani manishi tananu taanu nammi napude aakanksha neraveru tundi
tananu taanu shodinchinapude vastavam telustubdi.....

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం